*కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా భూమి పూజ
*కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్
విజయనగరం జిల్లా, వందేళ్ల చరిత్ర కలిగిన సీబీఎం స్కూల్‌ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని కొనుగోలు చేసిన వ్యక్తిపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు విచారణలో ఉన్న స్కూల్‌కు సంబంధించి వైసీపీ నేత ఒకరు శనివారం ఎవరూ లేని సమయంలో భూమి పూజ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇది న్యాయ వ్యవస్థను దూషించే చర్యగా పేర్కొంటూ, ఆయా వ్యక్తులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీబీఎం స్కూల్ వద్ద సిపిఐ, జనసేన, బీజేపీ, ఎంఆర్పిఎస్, రైతు సంక్షేమ సంఘం, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ నేతలు — జనసేన నాయకులు బాబు పాలూరు, సిపిఐ నేత మునకాల శ్రీనివాస్, రైతు సంక్షేమ సంఘం నాయకులు వేమిరెడ్డి లక్ష్మినాయుడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న, బి. రవికుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు కాగాన సునీల్ కుమార్, బీజేపీ నేత అనిల్ కుమార్ యాదవ్, జనసేన మండలాధ్యక్షులు బవిరెడ్డి మహేష్, బ్రదర్ అదృష్ట్ కుమార్, జి. విజయ్ కుమార్, జి. వేణు, ఎం. జ్యోతి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, సీబీఎం స్కూల్‌ను ప్రభుత్వ, ప్రజా ఆస్తిగా భావించి ఎవరు భవనాలు కట్టాలనుకున్నా అనుమతించబోమన్నారు. అక్రమ నిర్మాణాలకు ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రత్యక్ష ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.
Share this content:
Post Comment