సీసీ రోడ్డు పనులు ప్రారంభం

పి గన్నవరం నియోజకవర్గం: మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో మంగళవారం అడబాల వారి మరియు అగ్రికుల క్షత్రియ వారి పేటకు వెళ్లే సీసీ రోడ్డు పనులను మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు లూటుకుర్రు సర్పంచ్ అడబాల తాతకాపు, ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. రోడ్డు పనుల నిమిత్తం 3,50,000 వేల రూపాయలను ఖర్చు
చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అడబాల ఆంజనేయులు, అడబాల నాగేశ్వరరావు, బోనం అబ్బులు, పాలూరి పెద్ది రాజు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.