CCMB Recruitment: ఇంటర్ విద్యార్హత, ఇంగ్లిష్ టైపింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు..
CCMB Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్కులర్ బయాలీజీ (సీసీఎంబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) 4, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎఫ్ అండ్ ఏ) 1, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ అండ్ పీ) 1 ఖాళీలను భర్తీచేయనున్నారు.
మొత్తం పోస్టులు: 6
విద్యార్హత: ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు ఇంటర్ లేదా దానికి తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100
వయో పరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 ఏళ్లు మించి ఉండరాదు. (ప్రభుత్వ నియమాల ప్రకారం వయసులో సడలింపులు ఉంటాయి.)
దరఖాస్తులకు చివరి తేదీగా మే5గా ప్రకటించారు.
పూర్తి వివరాలకు http://www.ccmb.res.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
అప్లై చేసుకొనే విధానం..
ఆన్లైన్ దరఖాస్తు సోమవారం (05-04-2021) నుంచి ప్రారంభం కానుంది.
http://www.ccmb.res.in వెబ్సైట్లోకి వెళ్లాలి.
అనంతరం రిక్రూట్మెంట్ పేజీలోకి వెళ్లి నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.
తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, ఫీజు చెల్లించాలి.