తమన్నాకు బర్త్ డే విషెస్ తెలిపిన ‘ సీటీమార్ ‘ టీమ్..

మిల్కీబ్యూటీ తమన్నా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, పలువురు సినిమా తారలు తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తమన్నా నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రయూనిట్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపింది.

యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా నటిస్తున్న ‘ సీటీమార్ ‘ టీమ్.. నుంచి తమన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమె పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా కనిపించబోతోంది మిల్కీబ్యూటీ. ఇక ఈ చిత్రంలో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడబోతుంది. కాగా సినిమాలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా.. తమన్నా తెలంగాణ మహిళా జట్టుకు కోచ్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.