జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్నీ జయప్రదం చేయండి: పెండ్యాల శ్రీలత

అనంతపురం జిల్లా కేంద్రంలోని బళ్ళారి బైపాస్ గాయత్రి నగర్, దినేష్ ఫుడ్స్ పై అంతస్తులో జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని గురువారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత జనసేన నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ… మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. వారి రాజకీయ ఎదుగుదలకు బాటలు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ విధివిధానాలను మహిళా లోకం లోకి తీసుకెళ్లి స్త్రీల మద్దతును బలంగా కూడగడుతుమన్నారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై నేడు భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని జనసేన రాయలసీమ ప్రాంతీయ మహిళా విభాగం కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పేర్కొన్నారు. నేటి కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు, పట్టణ మండల జిల్లా కమిటీ నాయకులు కార్యవర్గ సభ్యులు, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ అనంతపురం జిల్లా మహిళా నాయకురాలు కాశెట్టి సావిత్రి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.