శ్రీ కృష్ణదేవరాయలు వారి 555 జయంతి సందర్భంగా కర్ణాటక కె.ఆర్ పురంలో బలిజ యువశక్తి, శ్రీ యోగి నారాయణ స్వామి బలిజ ఐక్యతా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయలు వారి జయంతి వేడుకలు, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి.కె ఆదికేశవుల తనయుడు డి.కె శ్రీనివాస్, రామయ్య ఎడ్యుకేషన్స్, కైవారం దేవస్థానము నిర్వాహకులు జయరాం రామయ్య, క్యలాస్యపాల్య మార్కెట్ ఏరియా ఎమ్మెల్యే దేవరాజ్ సతీమణి శ్రీమతి మమతా దేవరాజ్, జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, డి.కె చైతన్య లలితాంబిక, దక్షిణ భారతదేశ కె.టీవీ అధ్యక్షులు దాసరి రాము, బిజెపి రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, పలమనేరు బలిజ సంఘం అధ్యక్షులు ఆకుల గజేంద్ర, పలు విద్యాసంస్థల అధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి అమూల్యమైన సందేశం బలిజల గురించి, బలిజల చరిత్ర గురించి తమ ప్రసంగాల ద్వారా తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాళ్ళ సీమని రతనాల సీమగా భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 500 చెరువుల ద్వారా ప్రజల దాహాన్ని, రైతుల పంటలకు భారతదేశ ప్రజలు ఆకలి చావుల నుండి రక్షించిన మహా చక్రవర్తి శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు వారు అని తెలుగు జాతికి కీర్తి తెచ్చిన మహనీయులు అని దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు వారి గొప్పతనాన్ని నలుమూలల చాటించిన మహోన్నతమైన చక్రవర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె బలిజ నాయకులు హరిప్రసాద్, ఙానేంద్ర, బండి బాలాజి, బాలాజీ నాయుడు, ప్రకాష్ మగధీర, కోలార్ గౌవర్ధన్, కిషోర్, మురళి, వినయ్, పెద్ద ఎత్తున బలిజ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment