లక్ష్మణ్ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో సిజి రాజశేఖర్

తెలంగాణ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జనసేన పార్టీ అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ కు మద్దతుగా పత్తికొండ నియోజకవర్గం సమావేశం నిర్వహణ బాధ్యులు సిజి రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ నందు పోటీ చేసిన బీసీ బిడ్డ వంగ లక్ష్మణ్ గౌడ్ గారికి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరారు. రాజకీయాల్లో అందరూ స్వార్ధం నిండిన సమాజం.. కుయుక్తులు పన్నే నాయకులు.. రంగులు మార్చే రాజకీయం, ఇదీ నేటి వ్యవస్థ. అస్తవ్యస్తమైన రాజకీయాల్లోకి నిస్వార్ధమైన మనసుతో.. కళంకం లేని వ్యక్తిత్వంతో.. సమాజానికి మేలు జరగాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. సినిమా స్టార్ అయినా.. అశేష ప్రజాభిమానాన్ని లబ్దిగా చూడకుండా నా తెలుగు ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో జనసేన పార్టీ స్థాపించి అలుపెరుగని పోరాటం చేస్తున్న జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే, యువ కెరటం వంగ లక్ష్మణ్ గౌడ్ గారు, ఈ పోరాటాల గడ్డ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా వంగ లక్ష్మణ్ గౌడ్ గారిని ఎన్నికల బరిలో నిలిచారు. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలంగాణ శాసనసభకు పంపించాలని.. ప్రజల సమస్యలు బలంగా మాట్లాడగల వ్యక్తి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ఇలాంటి వ్యక్తి విజయానికి ప్రతి మెగాభిమాని, జనసైనికులు కలసికట్టుగా పని చేసి జనసేన విజయానికి కృషి చేద్దాం. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలుగా ముందుకు కదులుదాం. నవంబర్ 30న జరుగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మెషీన్లోని నెంబర్ 7లో ఉన్న గాజు గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వంగ లక్ష్మణ్ గౌడ్ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని జనసైనికులు మెగాభిమానులతోపాటు నాగర్ కర్నూల్ నియోకవర్గ ప్రజలను కోరుతున్నాం తెలియజేశారు.