సుగాలిప్రీతి 5వ సంస్మరణ సభలో పాల్గొన్న సిజి రాజశేఖర్

  • సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగి నేటికి ఐదేళ్లు
  • సుగాలి ప్రీతి తల్లిదండ్రుల్లా పోరాడే శక్తి కొందరికే ఉంటుంది. వారి పోరాటం అనితరసాధ్యం
  • నిందితులను కాపాడడానికి ఇప్పటికీ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అమ్ముడు పోయిన వ్యవస్థలు, వ్యక్తులు.

సుగాలిప్రీతి 5వ సంస్మరణ సభలో సిజి రాజశేఖర్ మాట్లాడుతూ… వైసిపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసి చంపిన దోషులను వెంట వేసుకో వస్తుందని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని చిలుక పలుకులు పలికిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసు ఒక్కదారి పట్టించారు, కనీసం సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సీఎం జగన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి, సుగాలి ప్రీతికి న్యాయం ఎవరు చేయరాని అర్థం చేసుకున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు జనసేన అహినేత పవన్ కళ్యాణ్ ను కలిసి మీరు ఎలాగైనా మా కూతురికి న్యాయం చేకూర్చాలని మాకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు కనుక సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటికి వచ్చి అసలైన దోషులకు శిక్ష పడుతుందని, సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలుకు వస్తున్నారని తెలుసుకొని హుటా హుటిన జీవో పాస్ చేసి జగన్ రెడ్డి, తన సామాజిక వర్గానికి చెందిన వారిని కాపాడుకోవడం కోసం ఈ కేసు విషయంలో మాట తప్పని మడమ తిప్పని జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి చేతులు దులుపుకున్నారని జగన్ మోహన్ రెడ్డికి నిజంగా మహిళలపై ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, దోషులైన, కర్నూల్ కట్టమంచి రామలింగారెడ్డి, స్కూల్ యజమాన్యం, మానవ మృగాలు, వి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి లచే ఆత్మహత్యకు గురైన ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం జరగాలంటే దోషులకు శిక్ష పడాలి మరో ఆడపిల్లపై ఇలాంటి ఆగత్యానికి పాల్పడకుండా ఉండే విధంగా శిక్ష పడాలని జనసేన పార్టీ తరఫున కోరుచున్నామని అన్నారు.