నందిగామలో గాజుగ్లాసుతో ఛాయ్

నందిగామ పట్టణం, మంగళవారం గాంధీ సెంటర్ నందు, నందిగామ జనసేనపార్టీ సమన్వయకర్త, శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలు, ఇతర ప్రజలతో, గాజు గ్లాసుతో ఛాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజలు, వారు ఎదుర్కుంటున్న సమస్యలని రమాదేవి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ అరాచక వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారని, రాబోవు 2024 ఎన్నికలలో ఈ వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో సరైన బుద్ది చెప్పి, జనసేన- టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించాలని రమాదేవి గారు పిలుపునిచ్చారు. అనంతరం నందిగామ నియోజకవర్గంలోని 19వ వార్డ్, అనాసాగరం గ్రామంలో శెట్టి నరేష్ ఆహ్వానం మేరకు భార్గవ్ రామ శంకర్ అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం పల్లె పథాన కార్యక్రమంలో భాగంగా రమాదేవి గారు, కంచికచర్ల మండలంలోనున్న పెండ్యాల మరియు కీసర గ్రామాల్లో పర్యటించారు. కీసర నుండి పెండ్యాల గ్రామానికి భారీ ర్యాలీతో జనసైనికులు స్వాగతం పలికారు. ఈ రెండు గ్రామ ప్రజలు, ముఖ్యంగా వారికున్న ఆనేక సమస్యలను రమాదేవి గారి దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ స్మశానవటికను వైసీపీ నాయకులు కబ్జా చేసారని తెలియజేసారు.నియోజకవర్గంలో నిరుద్యోగం, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడం, తాగునీరు, సాగునీరు లేకపోవడం, రోడ్లు సరిగా లేకపోవడం, జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఒక దివ్యంగుడి పెన్షన్ వైసీపీ ప్రభుత్వం తీసివేయడం గురించి పలు సమస్యలు విన్న వించుకున్నారు. రమాదేవి గారు, బాధితులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. జగన్ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో భవన నిర్మాణ కార్మికులు యూనియన్ లీడర్లు, నందిగామ జనసేనపార్టీ మండల అధ్యక్షులు కుడుపుగంటి రామారావు, సురా సత్యన్నారాయణ,కొమ్మవరపు స్వామి, మెల్లెంపూడి గోపి, నల్లగొండ మురళి కృష్ణ, పురంశెట్టి నాగేంద్ర,
జనసైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.