చాయ్ విత్ జనసైనిక్స్ – 3వ రోజు

*నెల్లూరు 8వ డివిజన్‌లో ఉత్సాహభరితంగా

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నెల్లూరులో నిర్వహిస్తున్న “చాయ్ విత్ జనసైనిక్స్” కార్యక్రమం మూడోరోజు తడికల బజార్ సెంటర్లో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొని భవిష్యత్తులో అసమానతలు లేని సమాజ నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యాలయ ఇన్‌చార్జ్ జమీర్, 8వ డివిజన్ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, రవిబెల్లపు సుధా మాధవ్, నక్కల శివకృష్ణ, మాధవ్ కస్తూరి, నందిని, ఇందిరా, మేకల ప్రసాద్ యాదవ్, రెండో డివిజన్ నుండి హుస్సేన్, పవన్ యాదవ్, పేనేటి శ్రీకాంత్, ప్రశాంత్ గౌడ్, రిషి యాదవ్, సురేష్, మహేష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. సామాజిక సమానత్వం, ప్రజాస్వామిక చైతన్యం కోసం జనసేన శ్రేణుల ఉమ్మడి కృషికి ఈ కార్యక్రమం చక్కటి వేదికగా నిలిచింది.

Share this content:

Post Comment