చాయ్ విత్ జనసైనిక్స్ 13వ రోజు

*ప్రజల మధ్యే జనసేన హృదయం

“నా పార్టీ కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని, జనసేన కార్యకర్తల ఆత్మీయ కలయికగా నెల్లూరులో ‘చాయ్ విత్ జనసైనిక్స్’ కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. 12వ డివిజన్ చింతా రెడ్డిపాలెం సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో జనసేన నేతలు ప్రజలతో మమేకమై పార్టీ ఆశయాలు, లక్ష్యాలను పంచుకున్నారు. ఏజెన్సీ పేదలే బంధువులని భావిస్తూ, వారి బాధలను తనవిగా అనుభవించే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో – ఆయన చేతుల మీదుగా రాష్ట్రంలో స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద తాగునీటి పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం, మౌలిక వసతులకు ఇచ్చిన ప్రాధాన్యతను నాయకులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, శ్రీపతి రాము, నూనె మల్లికార్జున యాదవ్, కిషోర్ గునుకుల, సుందర్ రామిరెడ్డి, జమీర్ తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ క్రమశిక్షణా విభాగం హెడ్ వెములపాటి అజయ్ మార్గనిర్దేశంలో కొనసాగుతున్న ఈ కలయిక, జనసేన పార్టీ ప్రజలతో కలసి ముందుకు సాగే నిబద్ధతను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

Share this content:

Post Comment