*నెల్లూరులో కూటమి పాలన విజయోత్సవం ప్రారంభం
*కూటమి సుపరిపాలన ప్రారంభమై ఏడాది పూర్తయింది
నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లలో ‘చాయ్ విత్ జనసైనిక్స్’ కార్యక్రమాన్ని జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ పిలుపుమేరకు ప్రారంభించారు. మొదటి రోజు మొదటి డివిజన్ లో పవన్ యాదవ్ ఆధ్వర్యంలో టీ సెంటర్ వద్ద జనసైనికులు కలసి సందడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, ప్రతి కార్యకర్త సేవను గుర్తించి, ప్రజాసమస్యలపై కృషి చేసే దిశగా కార్యకర్తలు ఒక్కటవ్వాలంటూ పిలుపునిచ్చారు. కాల్వ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు పేర్కొన్నారు.
Share this content:
Post Comment