*వైద్య సేవలపై పేషెంట్ల నుండి ఫీడ్‌బ్యాక్
విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని క్యాస్యువల్టీ వార్డును శనివారం సందర్శించిన ఏపిఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పేషెంట్లతో పరస్పరంగా మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకొని, సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ నాయకత్వంలో రాష్ట్రాన్ని “సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్”గా తీర్చిదిద్దే లక్ష్యంతో మెడికల్ సర్వీసుల మెరుగుదల కోసం కార్పొరేషన్ స్థాయిలో తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు.
Share this content:
Post Comment