పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో గల ఏరియా హాస్పిటల్ లో వంద పడకలతో అప్ గ్రెడెషన్ చేసిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు. సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం రోగులకు మరిన్ని సదుపాయాలను వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం సత్తెనపల్లిలోని ఏరియా హాస్పిటల్ ను వంద పడకలతో ఆసుపత్రితో పాటు, తగు యూనిట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా.అరవింద్ బాబుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం 6,500 కోట్ల బకాయిలను మన కూటమి ప్రభుత్వంపై భారాన్ని పెట్టినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోది ఆదేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో అధునాతన సాంకేతిక కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనలతో మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నందు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలనూ చేపడుతూ, అందులో భాగంగా రానున్న రోజుల్లో మంగళగిరి మరియు పిఠాపురం లోని ఆసుపత్రులను వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు, క్రిటికల్ కేర్ బ్లాక్ లను, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటూ మెరుగైన స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మెడికల్ హెల్త్(డిఎంహెచ్ఓ) ఆఫీసర్, పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ హెల్త్ సర్వీసెస్(డిసిహెచ్ఎస్), ఏరియా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఏపిఎంఎస్ఐడిసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ చిట్టిబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయక్, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం, సత్తెనపల్లి పట్టణంలో సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుల చేతుల మీదుగా హాస్పిటల్ డాక్టర్లు సింగరాజు సాయికృష్ణ, సింగరాజు విద్య సమక్షంలో ప్రారంభించడం జరిగింది.
Share this content:
Post Comment