*అక్టోబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలన్న స్పష్టం
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంసీడీసీ) చైర్మన్ చిళ్లపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ముందుగా జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇన్‌చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి దర్శించుకొని, డా. గంగులయ్య శాలువాతో సన్మానం చేశారు. మెడికల్ కళాశాల ప్రాంగణంలో క్లాస్‌రూములు, ల్యాబ్‌లు, హాస్టల్, ఇతర వసతులను పరిశీలించిన చైర్మన్ శ్రీనివాసరావు అక్టోబర్ నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వైద్య విద్యకు అవసరమైన ఫిజియాలజీ, అనాటమీ, హేమాటాలజీ విభాగాల పనితీరు, పరికరాల లభ్యతపై సమీక్ష నిర్వహించి, సూపరింటెండెంట్ కార్యాలయంలో అన్ని విభాగాలాధిపతులతో సమావేశమయ్యారు. వైద్య సేవల్లో లోటుపాట్లు లేకుండా చూసేందుకు అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, మెడికల్ కాలేజీ పనితీరు మెరుగుపడేలా ప్రతి విభాగం సమగ్రంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిట్లంగి పద్మ, బొంకుల దివ్యలత, కొర్ర కమల్ హాసన్, సీ. హెచ్. అనిల్ కుమార్, నందోలి మురళీకృష్ణ, మజ్జి నగేష్, వంపూరు సురేష్, మజ్జి సత్యనారాయణ, కుంచె దేవేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment