స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమాలు జగన్నాధపురం 22వ డివిజన్ ఎం.ఎస్.ఎన్ చార్టిస్ సెంటర్ వద్ద జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలోను, ఏటిమొగలోని అపార్ట్మెంట్ల ప్రాంతంలో బర్రే అప్పారావు ఆధ్వర్యంలోను, శ్రీరామ్ నగర్ ప్రాంతంలో నిమ్మకాయల చంద్రకిరణ్ ఆధ్వర్యంలోను జరిగాయి.
ఈ సంధర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. ఒక్కసారి అవకాశం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలందరూ తన మెరుగైన పాలనతో మెప్పిస్తాడనుకున్నారనీ కానీ దక్కినకాడికి దోచేయడానికని ఊహించలేదన్నారు. ప్రజలకి గతకొంతకాలంగా మేలు చేసే వివిధరకాల సంక్ష్యేమ పధకాలన్నీ ఆపేసి తనేదో కొత్తగా రత్నాలు అని పేరుపెట్టి బ్రహ్మాండం బద్దలైపొతున్నట్టు చెపుతూ ప్రజల దృష్టిని పక్కదోవ పట్టిస్తూ ఇంకోపక్కనుండీ తన అవినీతి చేతివాటంతో నొల్లేస్తున్నాడని ప్రజలకి ఇప్పటికి అర్ధం అయ్యిందన్నారు. అందుకే ప్రజలందరు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ వై.సి.పి ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పడానికి అని ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఓలేటి శ్రీనివాసరావు, ఓలేటి చిన్న, ఎం.సత్తిబాబు, కె.వెంకటేష్, రేకాడి వెంకటరమణ, బి.అప్పారావు, బి.సత్తిబాబు, మల్లిపుడి శివాజీ యాదవ్, వరిపల్లి ప్రసాద్, బొడపాటీ మరియ, వెంపల దుర్గా ప్రసాద్, కుడిపూడి గణపతి, వెంకటేశ్, నగేష్, ప్రసాద్, ఆనంద్, నారాయణ, పండు తదితరులు పాల్గొన్నారు.