17వ డివిజన్ లో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ ఆధ్వర్యంలో 17వ డివిజన్ జగన్నాధపురం వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతంలోను మరియు తోట కుమార్ ఆధ్వర్యంలో జి.పి.టి కాలేజ్ ప్రాంతంలోను జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రోజుకొకటి బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. మంచి పాలన ద్వారా చరిత్రలో నిలిచిపోయిన మహానుభావులను ఎప్పటికీ మరవని విషయం మన అందరికీ తెలుసు అనీ, కానీ నేడు అవినీతి పాలనతో కూడా చరిత్రలో నిలిచిపోవచ్చు అని ఈ వై.సి.పి ప్రభుత్వం చరిత్రకే ఒక కొత్త పాఠం నేర్పుతోందన్నారు. ఇంత దారుణమైన అవినీతిని ప్రజలు ఏనాడూ చూసి ఉండరనీ, మరీ ఇంత బరితెగించి అక్రమ సంపాదనకోసం వై.సి.పి పాలకులు అర్రులు చాచడం చూసి ప్రజలు విస్తుపోతున్నారనీ, వీళ్ళని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురు చూస్తున్నారనీ బహుశా ఇలాంటి స్థితిని ఎప్పుడూ మళ్ళీ చూడలేము అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, పినిశెట్టి సురేష్, పొట్లూరి అక్షయ దుర్గాప్రసాద్, గంపల ప్రసాద్, బస్వాని నాగబాబు, వరిపల్లి ప్రసాద్, దాసరి వీరబాబు, మూడే మధు, చోడిపల్లి సత్యవతి, బోడపాటి మరియా, ముల్లేటీ లొక భగవాన్, పెన్నమ్రెడ్డి బుజ్జి, రాయపాటి వెంకటేశ్వరరావు, తోట కృష్ణ తేజ, తోరం చిరంజీవి, తుమ్మలపల్లి సీతారాం, గుర్రాల త్రిమూర్తులు, దేవు మహేష్, నగులపల్లి వరప్రసాద్, తాతపూడి చిన్మయ శర్మ, పాకలపాటి అంజిబాబు, పాకలపాటి భాస్కర్, ముమ్మిడి పండు, అడపా కుమార్, దాసరి దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.