కాకినాడ జనసేన ఆధ్వర్యంలో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమాలు సుంకర సురేష్ ఆధ్వర్యంలో 36వ డివిజన్లో ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్లో వద్ద, తోట కుమార్ & నిమ్మకాయల కిరణ్ ఆధ్వర్యంలో మిలట్రీరోడ్డు, వంశీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రాంతంలోను, శివాజి ఆధ్వర్యంలో జగన్నాధపురంలోను జరిగాయి. ఈ సంధర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. ఈ ముఖ్యమంత్రికి డబ్బు సంపాదనమీద ఉన్న ధ్యాస పాలనమీద లేదనీ ఉంటే ఈ నాలుగున్నర ఏండ్లలో ఇన్నిసార్లు కరెంటు ధరలు పెరగవు, చెత్తమీద పన్ను కట్టే స్థాయికి ప్రభుత్వం దిగజారదన్నారు. అసలు ఇన్ని అప్పులు చేసిన ఈ వై.సి.పి ప్రభుత్వం సంక్షేమానికి సుమారు రెండున్నర లక్షలు ఖర్చుపెట్టామని చెపుతున్నారనీ మరి ఆ మిగిలిన అప్పుచేసిన సొమ్ము ఏంచేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. కాగ్ కి లెక్కలు చెప్పరు, కేంద్రానికి మొత్తం లెక్కలు చెప్పరు ఇలా మసిపూసి మాయ ఎంతకాలం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో నెగ్గాలని ఈ అవినీతి వై.సి.పి ప్రభుత్వానికి పిచ్చెక్కి ప్రజలను భయపెట్టి పీడించాలని చూస్తోందనీ దీనిని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా తిప్పికొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి శివ, 39వ ఇంచార్జ్ కాకినాడ సిటీ కమిటీ సభ్యులు లోవరాజు, ఆకుల శ్రీనివాస్, 43వ వార్డు ఇంచార్జ్ 35 ఇంచార్జ్ మనోహర్లాల్ గుప్తా, శ్రీమన్నారాయణ, శ్రీరామచంద్రమూర్తి, సిద్దేశ్, రాజు, శ్రీధర్, బండి సుజాత, సోని, దీప్తి, మరియా తదితరులు పాల్గొన్నారు.