“చక్ర” ట్రైలర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్
యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘చక్ర’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుoడగా ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర ఒక కీలకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన ట్రైలర్ పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను పెంచింది. కాగా ఇండిపెండెన్స్‌డే కానుకగా యువన్ శంకర్‌రాజా సంగీత సారథ్యంలోని ‘చక్ర’ ట్రైలర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సౌండ్ ట్రాక్‌కి మంచి స్పందన వస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్ నేపథ్యంలో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.