కావలి జనసేన నాయకుడు సిద్ధూను అభినందించిన చలపతి, శ్రీనివాస్

కావలి జనసేన నాయకుడు సిద్ధూ ను కలిసిన గుడ్లూరు జనసేన నాయకుడు అన్నంగి చలపతి మరియు చినపవని నాయకుడు ఇనకొల్లు శ్రీనివాస్. వీరు కావలి పట్టణం ‌సిద్దూ నివాసం వద్ద ముఖాముఖి పార్టీ ‌కార్యక్రమాల పట్ల చర్చించుకున్నారు. పట్టణంలో ఆయన చేస్తున్న పవనన్న అన్నదాన కార్యక్రమం, యువతకు భరోసా ఇస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. త్వరలో కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోని చినపవని గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం, జెండా ఆవిష్కరణ కార్యక్రమంనకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్బంగా సిద్ధూ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క జనసైనికుడు పవన్ కల్యాణ్ సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి, పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరడమైనది.