*క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించిన చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు
చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలో గల గిరిజన గ్రామమైన చలసింగంకు రహదారి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ రహదారి అభివృద్ధి పనులను జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు శుక్రవారం స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 2.5 కిలోమీటర్ల పొడవైన మొదటి దశ పనులు పూర్తయ్యాయి. రాతిబండలను తొలగించి, రహదారి ప్రాథమిక పనులన్నీ పూర్తయ్యాయి. రెండవ దశ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. మరో మూడు నుండి నాలుగు నెలల్లో రెండవ దశ పూర్తవుతుంది” అని కాంట్రాక్టర్ వివరించారు. ఈ పర్యటనలో రావికమతం–రోలుగుంట మండల జనసేన అధ్యక్షులు మైచర్ల నాయుడు, బలిజ మహారాజు, నాయకులు చింతల కిషోర్, పరవాడ దొరబాబు, కె. అప్పారావు, కోన రమణ, ఇటంశెట్టి ఈశ్వరరావు, సోమిరెడ్డి శివశంకర్, చలసింగం గ్రామ పార్టీ నాయకులు కిముడు గాంధీ, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రహదారి పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు సుళువైన రవాణా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment