జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రం

కవిటి మండలంలో శుక్రవారం కొరికాన పుట్టుగ గ్రామ జనసైనికులు గుమ్మడి కృష్ణ, గుమ్మడి శ్యామల రావు, కొర్రాయి కాళి ప్రసాద్, కడియాల తేజేశ్వర్, నర్తు కాళి, కడియాల రమేష్, గుమ్మడి రాజేష్, కొరికాన రాకేశ్ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు చేతుల మీదుగా కొరికాన పుట్టుగ జంక్షన్ వద్ద డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు ఎండలో ప్రయాణిస్తున్న కార్మికులకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.