అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం

విజయనగరం, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కామాక్షి నగర్, అయ్యన్న పేట జంక్షన్ వద్ద ఎస్సీ, బీసీ కాలనీలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ చలివేంద్రానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్స్ – 102 గవర్నర్ కర్రోతు సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో దాహార్తిని ప్రజలకు తీర్చడం వెలకట్టలేని పుణ్యకార్యమని, స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ క్లబ్బులు ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగ పడాలన్నారు. ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్లబ్ అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో రెండు నెలలు పాటు క్లబ్ ఆద్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాస్టారు, క్లబ్ గౌరవ సలహాదారులు ఎ.తిరుపతిరావు, క్లబ్ ఉపాధ్యక్షుడు పిడుగు సతీష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి లోపింటి కళ్యాణ్, డిస్ట్రిక్ట్ 102 క్యాబినెట్ కార్యదర్శి త్యాడ చిరంజీవి రావు, క్యాబినెట్ కోశాధికారి కె.వి.రమణ మూర్తి, డిప్యూటీ గవర్నర్ ఈపు విజయ్ కుమార్ మాస్టారు, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు చెల్లూరి శ్రీనివాసరావు (సి.హెచ్.రమణ) ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు పప్పు విశ్వనాధం, తోషిని వాలా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు డి.సన్యాసిరాజు, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ సభ్యులు వై.నలమారాజు, శ్రీనివాస్ మాస్టారు, పైడయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.