కెల్ల గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం

పార్వతీపురం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కెల్ల గ్రామం జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవసాయ పంటల నష్టాలతో మానసిక వేదనతో చనిపోయిన కౌలు రైతుల యొక్క కుటుంబాలకు ఒకో లక్ష ప్రకటించారని, ఈ విధంగా కౌలు రైతుల సుమారు 3000 కుటుంబాలకు, మొత్తం 30 కోట్ల రూపాయలతో ప్రణాఖిక ప్రకటించడం జరిగిందని.. ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, స్వయంగా వాళ్లని పరామర్శించి చెక్కులు అందజేయడం జరిగిందని గర్భాన సత్తిబాబు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలాంటి నాయకుడిని చూడలేదని, ఇలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే 2024 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తధ్యమని ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపి, జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, ఎంపిటిసి అభ్యర్థి వజ్రగడ రవికుమార్, డొంక శివకుమార్, గర్భాపు నరేంద్ర, మండంగి యోగేష్, కెల్ల గ్రామ జనసైనికులు ప్రసాద్, కృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.