అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం ప్రారంభం

పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, వెద్దళ్ళ నరవ గ్రామంలో నాయకులు సర్వసిద్ధి రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవామార్గంలో భాగంగా, ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ పేరు మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించాలని సదుద్దేశంతో చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం, మొదటిరోజు ప్రజలకు మజ్జిగా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ రాను రాను ఎండ తీవ్రత ఎక్కువ అవుతుందన్న విషయాన్ని పరిగణలో తీసుకొని జనసైనికులు అందరూ పవన్ కళ్యాణ్ భావజాలంలో అడుగులు వేస్తూ ప్రజలకు సేవ చేయాలని సదుద్దేశంతో ఈనాడు ఈ చలివేంద్రాన్ని ఇంత మంచి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభోత్సవాన్ని శుభదినంగా భావిస్తున్నామని, తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న జనసేన పార్టీ పరిష్కార మార్గంగా జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజలకి చేరువయ్యేలాగా మేమందరం కష్టపడి ఈ రాష్ట్రా భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించాలనీ, ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానని మాట్లాడడం జరిగింది, వార్డ్ నాయకులు చిన్న గారు మాట్లాడుతూ మా వార్డులో ఈ గ్రామం రెండవ పెద్ద గ్రామాన్ని, ఈ యొక్క గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో పుట్టిన జనసేన పార్టీని బలోపేతం చేయడంలో మా వంతు కృషి చేస్తామని, ఈ చలివేంద్ర ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం చేసినందుకు గ్రామ జనసేన పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, ప్రసాద్, గోపి, బొడ్డు నాయుడు, అశోక్, సురేష్, లోకేష్, నూకరాజు, సంతోష్, లక్ష్మణ, కిరణ్ జనసైనికులు మరియు ప్రజలు పాల్గొన్నారు.