మహా న్యూస్ పై దాడిని ఖండించిన చల్లా శివారెడ్డి

మహా న్యూస్ చానల్ కార్యాలయంపై జరిగిన దాడిని జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా శివారెడ్డి తీవ్రంగా ఖండించారు. దుండగులు దాడికి తెగబడి విధ్వంసం సృష్టించడం దారుణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులకు స్థానం లేదని, మీడియాను అణచేందుకు దాడులు, బెదిరింపులు ఉపయోగించడం సరికాదన్నారు. మహా న్యూస్ యాజమాన్యం, సిబ్బంది, జర్నలిస్టులకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ, జనసేన పార్టీ మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్టలకు ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Share this content:

Post Comment