పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్లకు సవాల్

  • భహిరంగ చర్చకు మేము సిద్ధం.. మీరు సిద్ధమా..?

శింగనమల: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో వాలంటీర్లని ఉద్దేశించి మాట్లాడిన మాటలను వక్రీకరించి కొందరు పెయిడ్ మీడియా, అధికార పార్టీ నాయకులు విష ప్రచారం చేస్తూ వాలంటీర్లను రెచ్చగొట్టి, పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం చేయిస్తున్నారని నార్పల జనసేన నాయకులు పేర్కొన్నారు మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సభలో ఏమి మాట్లాడారో కూడా కనీస ఆవగాహన వాలంటీర్లకు లేదన్నారు. కొందరు గుమ్మడి కాయల దొంగలు అంటే వాలంటీర్లందరు భుజాలు తడుముకుంటున్నారు ఎందుకో అని ప్రశ్నించారు. తప్పు చేసిన చేస్తున్న వాలంటీర్ల గురించి మాత్రమే కళ్యాణ్ గారు మాట్లాడారు అంతేగాని రాష్ట్రము లో వున్న అందరిని తప్పుబట్టలేదన్న విషయాన్ని వాలంటీర్లు గమనించాలన్నారు. గ్రామ, వార్డ్, వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారాన్ని సంఘ విద్రోహకశక్తులకు వైసీపీకి చెందిన అగ్రనాయకులు కొందరు అందించడం వలన మహిళలపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర నిఘావర్గాలు నన్ను హెచ్చరించాయని మాత్రమే పవన్ కళ్యాణ్ సభలో అన్నారని, ఈ మాటలని వైసీపీ అనుకూల మీడియా, నాయకులూ వక్రీకరించి వాలంటీర్లు ను రెచ్చ గొట్టి, పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక నినాదాలు, ర్యాలీలు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి, నాయకులకి నిజంగా మహిళలపై చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ సభలో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలని డిమాండ్ చేసారు. దాదాపు 30 వేలమంది మహిళలు అదృశ్యంపై ఆరోపణలలో నిజం లేకుంటే మీ దగ్గరున్న సమాచారాన్ని బయట పెట్టాలన్నారు. రాష్ట్ర హోమ్ మంత్రి ఈ విషయంపై స్పందించక పోవడంతో పాటు పవన్ చేసిన ఆరోపణల్ని తప్పుదోవ పట్టించడానికి వాలంటీర్లను రెచ్చగొట్టడం సిగ్గు చేటన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 420 నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసని, చేతగాని పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పాడికట్టే రోజులు ముందున్నాయని విషయాన్నీ మర్చిపోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, షేక్ రహంతుల్లా, వినోదం నారాయణ స్వామి, పొన్నతోట రామయ్య, వినోదం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.