చలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. వైసిపి అంతానికి పునాది: దుర్గారావు

శుక్రవారం దాచేపల్లి మండల పార్టీ కార్యాలయంలో జిల్లా పోగ్రాం కమిటీ మెంబర్ గా ఎన్నికైన వేల్పుల చైతన్య ని దుశ్శాలువతో సత్కరించిన అనంతరం జరిగిన సమావేశంలో జనసేనపార్టీ మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు మాట్లాడుతూ.. మార్చి 14 న గుంటూరు జిల్లా, ఇప్పటం గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు మండలంలో నలుమూలల నుండి జనసేన కార్యకర్తలు, విరమహిళలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మనం గతం చూసుకుంటే గుంటూరు జిల్లాలో జరిగే ఆవిర్భావ సభకు ఒక ప్రత్యేకత ఉందని గతంలో అదే ప్రాంతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2008 ఆవిర్భావ సభలో ఆ ప్రభుత్వ విధానాలను ఎండకట్టి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ పతనానికి నాంది పలికారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీ కొలుకోలేక పోయిందని.. ఇప్పటికీ 175 స్థానాల్లో అభ్యర్థులను నిలపెట్టలేని స్థితిలో ఉందని గుర్తు చేశారు. అదే మాదిరిగా ఇప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనను ఎండకడుతూ మరొక్కసారి ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ పిలుపు వైసీపీ నిరంకుశ ప్రభుత్వ పతనానికి నాంది కాబోతోందని తెలిపారు. ఇప్పటికే ఆ రెండు పార్టీల 60:40 బంధం రాష్ట్ర ప్రజలందరికి అర్ధం అయ్యింది. ఆ పార్టీలను నమ్మే స్థితిలో ఎవరూ లేరని ప్రజలందరి చూపు జనసేన వైపు ఉందని 2024 లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, ప్రోగ్రాం కమిటీ సభ్యుడు వేల్పుల చైతన్య మండల నాయకులు కోట మధు, సొంటెం కొండలు, గురజాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.