జగ్గంపేటలో ఛలో మచిలీపట్నం 10వ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ

  • 14వ తేదీన మచిలీపట్నం సభకు భారీగా తరలి వెళ్ళాలి
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు

జగ్గంపేట, ఈనెల 14న మచిలీపట్నంలో జరగబోయే జనసేనపార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సభ విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన మిడియాసమావేశంలో మాట్లాడారు. మచిలీపట్నంలో జరగబోయే పదవ ఆవిర్భావ దినోత్సవం చాలా ప్రత్యేకమైనదని, పవన్ కళ్యాణ్ ముఖ్య అథిదిగా పాల్గొని విలువైన సందేశం ఇస్తారని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీనీ ప్రజల్లోకి ఏవిధంగా ముందుకు తీసుకొని వెళ్ళలో దిశానిర్ధేశం చేస్తారని అన్నారు. కావున ఈ సభ కోసం రాష్ట్రంలోని జనసేన నాయకులు, జనసైనికులు, యువత, వీరమహిళలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారన్నారు. ఆయన ఇచ్చే సూచనలు మన మందరం గ్రామ గ్రామాన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, కావున ప్రతి గ్రామం నుండి మన జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అన్నారు. మన నియోజకవర్గం నుండి మూడు గంటలు వ్యవధిలో మచిలీపట్నం చేరుకోగలమని కావున వేలాది సంఖ్యలో మన నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామ గ్రామాన గడపగడపకీ తెలియపరిచేలా ప్రతి గ్రామం నుండి ప్రతీఒక్కరూ స్వయంగా బాధ్యత తీసుకొని ప్రచారం చేయాలని తెలియజేశారు. మన జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొనలని బుదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండల అధ్యక్షుడు ఉలిసి అయిరాజు, జగ్గంపేట జనసేన పార్టీ నాయకులు పాలిశెట్టి సతీష్, బీడీలు రాజబాబు, గ్రంధి సుబ్రహ్మణ్యం, ఏనుగుపల్లి శ్రీనివాసు, ఈపి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.