‘ఛలో నరసాపురం’ శాంతి ర్యాలీకి విశేష స్పందన

నరసాపురం పట్టణంలో నిర్వహించిన ‘ఛలో నరసాపురం’ శాంతి ర్యాలీలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఇటీవల రాజమండ్రిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రగడాల మృతికి నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా లూథరన్ చర్చ్ వరకు కొనసాగింది. ర్యాలీ పంజా సెంటర్ వద్దకు చేరుకోగానే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సంఘీభావం తెలిపారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, న్యాయమైన విచారణ జరిగి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన క్రైస్తవ సంఘాలకు, నరసాపురం ప్రజలకు తన సంఘీభావం ప్రకటించారు.

Share this content:

Post Comment