మైదుకూరులో “ఛలో పిఠాపురం” ఆత్మీయ సమావేశం

మైదుకూరు, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న “ఛలో పిఠాపురం” మరియు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు విజయవంతంగా నిర్వహించేందుకు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మార్గదర్శకత్వం అందించేందుకు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ హాజరై, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు “ఛలో పిఠాపురం” పోస్టర్ ఆవిష్కరణ చేసి అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ “ఛలో పిఠాపురం” కార్యక్రమం పార్టీ రాజకీయ ప్రస్థానంలో కీలకమైన ఘట్టమని, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంకు మైదుకూరు నియోజకవర్గం నుంచి జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు నిర్వహించిన కడప పార్లమెంట్ సమన్వయకర్త తాతంశెట్టి నాగేంద్ర, మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ పందిటి మల్హోత్రా, ఉమ్మడి కడప జిల్లా ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, కడప నగర అధ్యక్షులు బోరెడ్డి నాగేంద్ర, అజయ్ వర్మ, అశోక్, ఆలీ మరియు జనసైనికులు, మైదుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment