కడప, వేంపల్లి, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న “ఛలో పిఠాపురం” మరియు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను సమీక్షించేందుకు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మార్గదర్శకత్వం అందించేందుకు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ హాజరై, జనసేన నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అనంతరం సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ… “ఛలో పిఠాపురం” కార్యక్రమం పార్టీ రాజకీయ ప్రస్థానంలో కీలకమైన ఘట్టమని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం జనసేన నిరంతరం పోరాడుతుందని, పార్టీకి ప్రతి కార్యకర్త మూలస్తంభమై పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో పులివెందులలో జనసేన విజయాన్ని ఖాయంగా చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, కడప జిల్లా నియోజకవర్గాల పిఓసిలు మరియు జనసైనికులు మరియు పులివెందుల నియోజకవర్గ జనసేన నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment