“ఛలో పిఠాపురం – జనసేన” పోస్టర్ ఆవిష్కరణ

సత్తెనపల్లి నియోజకవర్గంలోని దూళిపాళ్ల గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “చలో పిఠాపురం – జనసేన” నినాదంతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు గారు పాల్గొని జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించి, అనంతరం జనసేన జెండాను ఎగరవేశారు. ఆయన జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొని జనసేన విజయయాత్రలో భాగస్వామ్యం అయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో కార్యకర్తలు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నట్లు తెలియజేశారు.

Share this content:

Post Comment