ఛలో పిఠాపురం.. జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేద్దాం: చందక అనీల్

🚩12వ వార్డ్ మహిళలతో ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ చేసిన జనసేనపార్టీ నాయకులు రెడ్డి నాగరాజు
🚩నిత్యం ప్రజలతో ఉన్న కష్టజీవులు, క్రియాశీలక సభ్యులతో ఛలో పిఠాపురం పోస్టర్లు ఆవిష్కరణ

పార్వతీపురం నియోజకవర్గం, మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12 వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న మీరందరూ పిఠాపురం ఆవిర్భావ సభ పండగలో పాలుపంచుకోండి అని జనసేనపార్టీ నాయకులు చందక అనీల్ ఆహ్వానం పలికారు. అలాగే 12వ వార్డ్ మహిళలతో ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ చేయించిన జనసేనపార్టీ నాయకులు రెడ్డి నాగరాజు. అనంతరం నిత్యం ప్రజలతో ఉన్న కష్టజీవులు, క్రియాశీలక సభ్యులతో ఛలో పిఠాపురం పోస్టర్లు ఆవిష్కరణ చేయించిన జనసేన నాయకులు నెయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, భమిడిపాటి చైతన్య, బార్ణాల పవన్, సంబనా రమేష్, నగేష్ తదితరులు. అలాగే ఛలో పిఠాపురం.. జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేద్దాం అని నినాదాలతో అందరిలో చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డ్ మహిళలు, పెద్దలు, యువత మార్కెట్ యార్డు కలాసిలు మరియు వంట గ్యాస్ ఇంటింటికీ అందించే సోదరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment