ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ

జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి నేమురీ శంకర్ గౌడ్ మరియు నల్గొండ జిల్లా ఇంచార్జి మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 14 జనసేన పార్టీ12వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు షేక్ హసన్ మియా, గాజనాబోయిన సైదులు యాదవ్ మాట్లాడుతూ మార్చ్ 14, 2014 పార్టి స్థాపించిన నాటి నుండీ నేటి వరకు పవన్ కళ్యాణ్ అద్వర్యంలో జనసేన పార్టీ ఎన్నో ప్రజా పోరాటాలు చేసినందుకు ప్రజల మద్దతుతో 100శాతం గెలుపు సాధించి చరిత్ర సృష్టించిందని, అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయోత్సవ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్న మని తెలిపారు. ఈ సభకు హుజుర్నగర్ నుండీ కార్యకర్తలు భారీగా రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యం, ఉదయ్, నాగరాజు, అల్లాఉద్దీన్, పవన్, చిలకరాజు గోపి, ములకలపల్లి హరి, రాజు, ప్రవీణ్, వేణు, పుష్ప పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment