కడప, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మార్చి 14న జరగనున్న “ఛలో పిఠాపురం” కార్యక్రమానికి సంబంధించి జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ & కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్ర పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 14న నిర్వహించనున్న “ఛలో పిఠాపురం” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధికి, మరియు పార్టీ ఆవిర్భావ విజయోత్సవ సభకు మద్దతుగా అందరూ పాల్గొనాలని కోరారు. అలాగే, అనంతరం సుంకర శ్రీనివాస్ పులివెందుల ఎంఎల్ఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “జగన్ నువ్వు వెర్రి వెంగళప్పకి ఎక్కువ పిచ్చి పుల్లయ్యకి తక్కువ అని హెచ్చరించాడు” జనసేన పార్టీపై, పవన్ కళ్యాణ్ పై అసత్య ఆరోపణలు చేయడం జగన్ తగదని, మేము చూస్తూ ఊరుకోమని జగన్ ని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, కడప నగర అధ్యక్షులు బోరెడ్డి నాగేంద్ర, కమలాపురం నియోజకవర్గం పీఓసీ వేణుగోపాల్ రెడ్డి, నగర కార్యదర్శులు చార్లెస్, తరుణ్, వెంకటేష్, అశోక్, అనిల్ వర్మ, జి.టి. కుమార్, రాజకీయ కార్యదర్శి ఫ్రాన్సిస్, అజయ్ వర్మ, ఆలీ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment