తిరువూరు, ఈనెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయవలసిందిగా ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరించిన తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, మరియు నియోజకవర్గ జనసైనికులు.. బుధవారం సాయంత్రం తిరువూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 11 ఆవిర్భావ దినోత్సవాలు పోరాటాలతో జరుపుకున్నామని, ఈనెల 14వ తేదీన పిఠాపురం లో జరగనున్న 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలును ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ పండగలా నిర్వహించనున్నదని, ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.. ఇదే సందర్భం ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి 50 కోట్ల రూపాయలు ముడుపులు నెల నెలా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారని ఆరోపించిన నేపథ్యంలో దువ్వాడ మీద చర్యలు కోరుతూ తిరువూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, గతంలో కూడా దువ్వాడ తన స్థాయిని మరచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారని రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావు లేదని రాజకీయపరంగా విభేదాలుంటే సిద్ధాంతపరంగా మాట్లాడటంలో తప్పులేదు కానీ ఇలా వ్యక్తిగత దూషణలకు, నిరాధార ఆరోపణలకు దిగిన దువ్వాడ శ్రీనివాస్ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైనదని ఆయన అన్నారు. ఈరోజు బెయిలుకు – జైలుకు మధ్య ఊగిసలాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం దారుణమని, ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి అధోగతి పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు గతంలో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత దూషణలు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారని, ఆనాడు పవన్ కళ్యాణ్ వాళ్లు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని అదఃపాతాళానికి తొక్కుతానని బహిరంగంగానే ఛాలెంజ్ చేశారని, అన్నట్లుగానే 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో 11 సీట్లకే వైసిపి పరిమిత మైందని అయినా ఇంకా బుద్ధి రాలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉయ్యూరు జయప్రకాష్, పసుపులేటి రవీంద్ర, లింగినేని సుధాకర్, బత్తుల వెంకటేశ్వరరావు, కస్తూరి సీతారామస్వామి, వెల్ఫేట్ సత్యనారాయణ, ఉయ్యూరు మీనా కుమారి, ఉయ్యూరు శ్యామ్, వేల్పుల నాగరాజు, బండారు తరుణ్, గుంజ కృష్ణ, వీరేంద్ర, అఖిల్ రాయల తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment