కొండపి నియోజకవర్గంలో ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు కలిసి నడిచిన జనసైనికులు, వీరమహిళలు సగర్వంగా వేడుక చేసుకుందామని, పిఠాపురంకి మార్చి 14న రానున్న జనసేన ఆవిర్భావ సభకు తాము అందరితో కలిసి చేరాలని కోరారు. వంద శాతం స్టైక్ రేటుతో విజయం సాధించిన తర్వాత మార్చి 14న చిత్రాడ, పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకి జనసేన మద్దతుదారులు, నాయకులు, వీర మహిళలు హాజరుకావాల్సిందిగా సింగరాయకొండలో జనసేన పార్టీ కార్యాలయంలో “ఛలో పిఠాపురం” పోస్టర్ ఆవిష్కరించారు. పది సంవత్సరాలపాటు సామాన్య ప్రజల సమస్యలను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గత ఆవిర్భావ సభలో ఈసారి గెలిచి వేడుక చేసుకుందాం అని చెప్పారు. 100% విజయాన్ని సాధించిన జనసేన నాయకులు, వీర మహిళలు భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పిఠాపురంలో అభివృద్ధిని చూసిన జనసైనికులు సగర్వంగా ఈ వేడుకకు హాజరు కావాలని కోరారు. కొండపి నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో జనసేన నాయకులు 12వ ఆవిర్భావ వేడుకకు వెళ్లనున్నట్లు, బస్సులు, ఆహార సదుపాయాలు అందిస్తున్నట్లు సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.
Share this content:
Post Comment