Narsipatnam: “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” ఛలో విశాఖపట్నం వాల్ పోస్టర్ విడుదల

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితికి మద్దతుగా ఆక్టోబర్ 31వ తేదీన జరిగే బహిరంగ సభలో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ సంఘీభావసభను విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. సభకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు వీలుగా బుధవారం నర్సీపట్నం నియోజకవర్గంలో గోడ పత్రికను విడుదల చేశారు. నియోజకవర్గం నాయకులు శ్రీ రాజాన వీర సూర్యచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 34 మంది ఆత్మబలిదానాలకు ప్రతీక అయిన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర పౌరులందరి మీద ఉందని, శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి జనసేన కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షులు వూడి చక్రవర్తి. గొలుగొండ మండల నాయకులు శ్రీ రేగుండ్ల శివ, శ్రీ గండం దొరబాబు, మాకవరపాలెం మండల నాయకులు శ్రీ నిమ్మి మంగరాజు నానాజీ, నర్సీపట్నం టౌన్ నాయకులు శ్రీ మారిశెట్టి రాజా, శ్రీ ద్వారపూడి జగదీష్, శ్రీ మోపాడ చిరంజీవి, శ్రీ పరవాడ లోవరాజు. నాతవరం మండలం నాయకులు శ్రీ బైన మురళి, శ్రీ మంగళ భాస్కర్, శ్రీ రాజేష్, శ్రీ పోతురాజు వెంకటరమణ, శ్రీ మల్లాడి శ్రీను, శ్రీ చిన్న పోతుల నాగు, శ్రీ అల్లు నరేష్, శ్రీ బంటు ప్రసాద్, శ్రీ ఎం. రామకృష్ణ, శ్రీ కొత్తకోట రామశేఖర్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.