యువశక్తి భారీ బహిరంగ సభకు తరలి వెళ్లిన పిఠాపురం యువత

పిఠాపురం: వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో యువతకి ఉపాధి లేక ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందికి గురవుతున్నారని, రాష్ట్రంలో ఉన్న యువతకి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తులు ముఖ్యమంత్రి అవ్వాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యువశక్తి భారీ బహిరంగ సభకు పిఠాపురం నియోజకవర్గం నుండి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనసైనికులు, వీరమహిళలు యువకులు బస్సుల్లో బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లాదీపిక శ్రీధర్ జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపిక శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియపరుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా యువత సమస్యలపై గల మెత్తనున్న జనసేననికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువతతో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు బయలుదేరినట్లు డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ అన్నారు.