Champions Trophy 2025: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్టు బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు

Champions Trophy 2025: ఐసీసీ ప్రపంచకప్ తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగినది ఛాంపియన్స్ ట్రోఫీ. అందుకే అంత ఆసక్తి రేపుతోంది. దుబాయ్, పాకిస్తాన్ వేదికలపై ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో రేపు ఫిబ్రవరి 20న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్ల సామర్ధ్యం, విజయావకాశాల గురించి పరిశీలిద్దాం.

ఇప్పటి వరకు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మద్య 41 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 32 మ్యాచ్‌లు గెలిస్తే బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక దుబాయ్ వేదికగా ఇండియా 6 వన్డేలు ఆడగా ఐదింట ఇండియా గెలిస్తే ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఒకటి గెలిచి రెండు ఓడింది. రేపు జరిగే మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి కీలక ఆటగాళ్లు బలాబలాలేంటో చెక్ చేద్దాం. బంగ్లాదేశ్ నుంచి తస్కిన్ అహ్మద్ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వగలడు. మొత్తం 77 మ్యాచ్‌లు ఆడి 30 సరాసరితో 108 వికెట్లు తీసుకున్నాడు. ముస్తఫీజుర్ రెహ్మాన్ 25.19 సరాసరితో 115 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ యావరేజ్ బాగుంది. బ్యాటింగ్ యావరేజ్ 36.12కాగా 67.58 స్ట్రైక్ రేట్‌తో 590 పరుగులు చేశాడు. ఇవి ఆసియాలో చేసిన పరుగులు మాత్రమే. ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. మరో బ్యాటర్ మహ్మదుల్లా. స్ట్రైక్ రేట్ 74.86 ఉంది. మొత్తం 3321 పరుగుల చేశాడు. 

ఇక టీమ్ ఇండియా నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌పై చాలా ఆశలు ఉన్నాయి. మొన్నటి వరకు ఫామ్‌లో లేని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలే పుంజుకోవడం మంచి పరిణామంగా ఉంది. ఇక ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యాలపై జట్టుకు చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా రాణిస్తే ఇక తిరుగు ఉండదు. 

Share this content:

Post Comment