జనసైనికుడు చందక బంగార్రాజు పెద్దకర్మకు తరలివెళ్లిన జనసేన నాయకులు

పాడేరు: జూన్ 14వ తేదీన తుని జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన కొయ్యురు మండలం బాలారం వాసి జనసైనికుడు చందక బంగార్రాజు పెద్ద కర్మకు జనసేన పార్టీ నాయకులు అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య హాజరై కీర్తి శేషులు చందక బంగార్రాజు చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెబుతూ జనసేన పార్టీ ద్వారా మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా కొయ్యురు, చింతపల్లి, పాడేరు, జి.మాడుగుల నాయకులతో కలిపి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ భవిష్యత్ లో ఏ సమస్య వచ్చినా మీకు దగ్గరగా ఉన్న కొయ్యురు జనసేన నాయకులకి, మాకు తెలియజేస్తే చాలని, తక్షణమే స్పందిస్తామని హామీ ఇచ్చారు. మేముకూడా ఒక జనసేన కుటుంబీకుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నామని, ఎటువంటి సందర్భాల్లో సైతం ధైర్యం కోల్పోవద్దని గంగులయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, రామకృష్ణ, తాంగుల రమేష్, మజ్జి సంతోష్, కొయ్యురు మండల నాయకులుసాగిన బుజ్జి బాబు, గూడెం లక్ష్మణ్, జుర్రా, సూర్య ప్రకాష్, గోకిరి శీను బాబు, కాకర కుమార్, పొట్టికరాంప్రసాద్, బుజ్జి బాబు, సిహెచ్ సిద్దు, వాసం సాయిబాబు, పురా రాజేష్, నత్తూరు శీను బాబు, రామకృష్ణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.