చంద్రబాబునాయుడు అరెస్టు ముమ్మాటికి కక్షసాధింపే

ప్రత్తిపాడు నియోజవర్గం: 34 రోజుల క్రితం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం లపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టు రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు వల్లే జరిగిందని అభిప్రాయాన్ని నాయ్యకోవిదులు వెల్లడిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే రాష్ట్రస్థాయిలో మొట్టమొదటిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పలకరించి వెనువెంటనే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు ప్రకటించడం జరిగింది. చంద్రబాబునాయుడుని అరెస్టు చేసిన తర్వాత ఎఫ్ఐర్ లో పేరు నమోదు చేయడం, రిమాండ్ కి పంపిన తర్వాత మరో మూడు కేసుల్లో చంద్రబాబునాయుడుని ముద్దాయిగా చూపిస్తూ ఎసిబి కోర్టు, హైకోర్టులలో రాష్ట్ర ప్రభుత్వం మెమోలు దాఖలు జరిగింది, చంద్రబాబునాయుడుని కస్టడీకి కోరుతూ సిఐడి, ఏసీబీలు కోర్టులను కోరడం జరిగింది. ఈ విధమైన చర్య కేవలం కక్ష సాధింపు వల్లనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారు, కానీ ఇప్పటికి సి ఐ డి వారు హైకోర్టు నందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడు చేసిన అవినీతి ఏ బ్యాంక్ అకౌంట్ ఎకౌంటు ద్వారా జరిగిందనే స్టేట్మెంట్ తీసుకోలేదని, అవినీతి అధికారులను, ఇతర సాక్షులను కూడా మేము ఇంకా విచారణ చేయవలసిఉందని మెమోను వేయడం జరిగింది.ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు సరైన కారణాలు, పూర్తి ఆధారాలు చూపించకుండా అరెస్టు చేయడం అన్యాయమనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి గాని సి ఐ డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉన్నది. చంద్రబాబునాయుడుని అక్రమంగా అరెస్టు చేసిన కారణంగా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు భారీ స్థాయిలో పుంజుకున్నాయి.ఒక విధంగా తెలుగుదేశంపార్టీ, జనసేనపార్టీ ప్రజలలోకి వెళ్ళడానికి చంద్రబాబునాయుడు అరెస్టు బాగా సహకరించినది.