చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్య

  • ఉన్నమట్ల ప్రేమ్ కుమార్

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యగా ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ అభివర్ణించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు. పన్నులతో కరెంట్ బిల్లులతో ప్రజల నెత్తిన గుదిబండ మోపారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నులిమేస్తున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికం. పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో టిడిపి శ్రేణులకు జనసేన కూడా మద్దతు తెలియజేసిన సందర్బంలో వై.కా.పా నాయకులు పోలీస్ వ్యవస్థను వారికి అనుకూలంగా వాడుకుంటూ ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యం లో మంచిది కాదని అతి త్వరలోనే జగన్ సర్కార్ కూలిపోనుందని ఎన్నికల కోసం పార్టీల కంటే ప్రజలే ఎక్కువ ఎదురు చూస్తున్నారని ప్రజాతీర్పు ముందు తలవంచక తప్పదని జనసేన జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ హెచ్చరించారు.