ANR కు చంద్రబాబు ఘన నివాళి

మహానటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు. దివంగత నటుడు ఏఎన్నార్ జయంతి ని పురస్కరించుకుని పలు రంగాల సెలబ్రిటీలు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. దివంగత నటుడు ఏఎన్నార్‌కు నివాళి అర్పించారు. ఆయన సేవల్ని స్మరించుకోవాలని సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

‘తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు నిలిచారు. సినిమాల పరంగానే కాదు విశిష్టమైన వ్యక్తిత్వాలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణలతో ఆ ఇద్దరు కోట్లాది మందికి ఆదర్శనీయులయ్యారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారి జయంతి సందర్భంగా ఆ మహానటుని కళాసేవను స్మరించుకుందాం’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.