ఏ.కే.యూ అడ్మిన్ స్థానాలలో మార్పులు

*ఏ.కే.యూ ఓ.ఎస్డి గా ప్రొఫెసర్ రాజ మోహన్ రావు నియామకం

నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు పరిపాలన పరమైన సౌలభ్యం కోసం ఏ. కే.యూ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి సూచనల మేరకు పలు అడ్మిన్ స్థానాలలో మార్పులు చేసినట్లు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు శుక్రవారం తెలిపారు. నూతనంగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఓ.ఎస్డి గా ప్రస్తుతం ప్రిన్సిపల్ గా పని చేస్తున్న ప్రొఫెసర్ జి.రాజ మోహన్ రావును నియమించారు. అలాగే ఏ.కే. యూ కళాశాల ప్రిన్సిపల్ గా, ప్రస్తుత వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలా మణిని నియమించారు. ఇప్పటి వరకు సిడిసి డీన్ గా పనిచేసిన ప్రొఫెసర్ జి. సోమ శేఖరను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వైస్ ప్రిన్సిపాల్ గా నియమించగా, సి.ఈ గా పనిచేస్తున్న డాక్టర్ కే.వి.ఎన్.రాజును సిడిసి డీన్ గా నియమించారు.ప్రస్తుతం జరిగిన మార్పులు, చేర్పులు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని రిజిస్టార్ ప్రొఫెసర్ హరి బాబు తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. నూతనంగా విధుల్లో చేరనున్న అడ్మిన్ లు ఈ పదవుల్లో తదుపరి ఉత్తర్వులు వెలువడెంత వరకు కొనసాగుతారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. నూతనంగా అడ్మిన్ స్థానాలను పొందిన ఆంధ్ర కేసరి ప్రొఫెసర్లకు వి.సి ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తదితరులు నియామక పత్రాలను అందజేసిన అనంతరం వారిని హృదయ పూర్వకంగా అభినందించారు.

Share this content:

Post Comment