ఏపీలో విలేజ్ హార్డికల్చర్ అసిస్టెంట్ పోస్టుల అర్హతల్లో మార్పులు

గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,783 విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతల్లో కొన్ని మార్పులను చేసినట్లు ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తించిన 4 సంవత్సరాల బీఎస్సీ(హార్టికల్చర్), లేదా వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ నుంచి 2 సంవత్సరాల డిప్లొమో (హార్టికల్చర్) పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. అవి కాకుండా మరే ఇతర అర్హతలూ ఈ పోస్టులకు చెల్లవని ఆయన వివరించారు. నియామకంలో భాగంగా ఈ నెల 25 న నిర్వహించనున్న పరీక్షలకు మిగతా అర్హతలున్నవారు ఒక వేళ హాజరై పరీక్ష రాసినా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని, అభ్యర్థులందరూ ఈ విషయం గమనించాలని కమిషనర్ చిరంజీవి చౌదరి కోరారు.