‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి అడుగుపెట్టిన చరణ్!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే కరోనా కారణంగా అప్పుడప్పుడు షూటింగుకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఆలస్యానికి కరోనా కూడా ఒక కారణమవుతూ వస్తోంది. సెకండ్ వేవ్ వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఇప్పుడు కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగును మొదలుపెట్టారు. చాలా రోజుల తరువాత మళ్లీ సెట్లోకి చరణ్ అడుగుపెట్టాడు. ఈ రోజు నుంచి చరణ్ పోర్షన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా, చరణ్ తో పాటు సెట్స్ కి వచ్చాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో, కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇటు చరణ్ ఫ్యాన్స్ .. అటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి  ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.