ఎస్.పి.బి ఆరోగ్యంపై చరణ్ అప్‌డేట్

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు.  నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పటికీ ఎక్మోతో పాటు వెంటిలేటర్‌ కూడా కొనసాగుతుంది. అయినా కూడా ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.