పవన్-క్రిష్ సినిమాకి చార్మినార్ సెట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకి ‘హరిహర వీరమల్లు’ టైటిల్ పరిశీలనలో ఉంది. పీరియడిక్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. మొఘలాయీల పాలన నాటి కాలంలో జరిగే చారిత్రాత్మక కథతో రూపొందుతోంది. ఇందులో పవన్ వజ్రాలదొంగగా వెరైటీ పాత్రలో కనిపిస్తారట.

కాగా, చార్మినార్‌ నేపథ్యంలో చిత్రంలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చార్మినార్ సెట్‌ వేయించారని తెలుస్తోంది. కథానాయికలుగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖరారు కావాల్సివుంది. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్ షూటింగ్‌లోను పవన్ బిజీగా ఉన్నారు.